రాష్ట్రంలో నాఫ్ఫ్కో రూ.700 కోట్ల పెట్టుబడి

NAFFC has invested Rs.700 crores in the state– మంత్రి కేటీఆర్‌తో సమావేశంలో సంస్థ ప్రతినిధుల వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
యూఏఈ చెందిన సంస్థ నాఫ్ఫ్కో రాష్ట్రంలో రూ.700 కోట్లతో అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ఆ సంస్థ కంపెనీ సీఈవో ఖాలిద్‌ అల్‌ ఖతిబ్‌ వెల్లడించారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ దుబారు పర్యటనలో భాగంగా సదరు కంపెనీ ప్రతినిధులతో సమావేశ మయ్యారు.
ఈ సందర్భంగా ఖతీబ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్‌తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్‌ సేఫ్టీ ట్రైనింగ్‌ అకాడమీ ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రూ.215 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రముఖ పోర్ట్‌ ఆపరేటర్‌ డీపీ వరల్డ్‌ గ్రూప్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అనిల్‌ మెహతా, డీపీ వరల్డ్‌ ప్రాజెక్టు డెవలప్మెంట్‌ డైరెక్టర్‌ సాలుష్‌ శాస్త్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రణాళిక ను మంత్రి సమక్షంలో వారు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో తీసుకొచ్చిన వ్యాపార అనుకూల విధానాలను వారికి వివరిం చారు. మలబూర్‌ గ్రూప్‌ సంస్థ చైర్మెన్‌ ఎంపీ అహ్మద్‌ రూ.125 కోట్ల పెట్టుబడి పెడతామనీ, రాష్ట్రంలో ఫర్నీచర్‌ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని తెలి పారు. మొత్తంగా మంత్రి దుబారు మొదటి రోజు పర్యటనలో ఆయా కంపెనీలు రూ.1,040 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సిరి సిల్ల అక్వా క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ కంపెనీ పెట్టు బడులతో 500 మందికి ఉపాధి అవకాశాలు వస్తా యని తెలిపింది. ఆ సంస్థ ఈ ప్రాంతం నుంచి రూ. 1,000 కోట్ల అక్వా ఉత్పత్తులను సేకరించనున్నట్టు వెల్లడించింది.

Spread the love