నాలా నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-చందానగర్‌
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో లింగంపల్లి అండర్‌ బ్రిడ్జి సమీపంలో రూ. 4 కోట్లతో చేపట్టబోయే నాలా నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన పలు అభివృద్ధి పనులపై చర్చిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లా డుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో లింగంపల్లి అండర్‌ బ్రిడ్జి సమీపంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసి, త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. మట్టి రోడ్లు ఉన్న ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలనీ, అసంపూర్తి నాలాల విస్తరణ పనులలో వేగం పెంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ను కోరారు. వెంటనే స్పందించిన కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే లింగంపల్లి అండర్‌ బ్రిడ్జి సమీపంలో ఉన్న విస్తరణ పనులు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లను పూర్తి చేస్తామన్నారు.

Spread the love