నరేంద్ర మోడీకి గట్టి దెబ్బకొట్టాలి

– కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
– మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి… అండగా ఉంటా..
– పది సంవత్సరాల లో తెలంగాణకు బీజేపీ ఏం చేసింది
– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి నరేంద్ర మోడీకి గట్టి దెబ్బ కొట్టాలని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని పోతరం ఎస్ గ్రామంలోని శుభం గార్డెన్ లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పోన్నం ప్రభాకర్ మాట్లాడాతూ..  కరీంనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో 7 నియోజకవర్గల కంటే హుస్నాబాద్ నియోజవర్గం నుండి  ఎక్కువ మెజారిటీ వచ్చేలా చూడాలన్నారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించుకోవాలని కోరారు. బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ కి ఒక విద్యాలయం, వైద్యాలయం, తీసుకురాలేదన్నారు. విభజన హామీలు అమలు చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ను పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ చనిపోయిన అమరవీరులను అవమానించారన్నారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్, గతంలో ఎంపీగా చేసిన వినోద్ కుమార్ ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి ఏం తెచ్చారో చెప్పాలన్నారు.  వినోద్ కుమార్ ఈ జిల్లా వాసి కాదని..మన లెక్క కాదని అన్నారు. మన పార్టీ అభ్యర్థి ఎంపిగా గెలిస్తే మానవతావాది రాహుల్ గాంధీ  ప్రధాని అవుతారని, దేశాన్ని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. బిఆరెస్ కి ఓటు వేసి వృదా చేసుకోవద్దని అన్నారు. నియోజకవర్గంలో 304 పోలింగ్ బూత్ లు ఉన్నాయని, మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు. గ్రామ స్థాయి నాయకులు ,మండల నాయకులు గ్రామాల్లో ఏ సమస్య ఉన్న చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళకు ఉచిత ప్రయాణం, రూ. 500 కి గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ తెచ్చామని ప్రజలకు చెప్పాలన్నారు. ఆగస్టు లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే వర్షాకాలంలో పంటలకు రూ .500 బోనస్ ఇస్తామని రైతులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,  ఆది శ్రీనివాస్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, ఆరేపల్లె మోహన్, వెలిచాల రాజేందర్, హుస్నాబాద్ పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, చిత్తూరు రవీందర్ చిత్తర పద్మ, మండల అధ్యక్షులు బంక చందు, జంగపల్లి ఐలయ్య హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love