నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ జాతీయ మ్యానిఫెస్టోను రాష్ట్రంలో ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు గురువారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి శ్రీధర్ బాబు చైర్మెన్‌గా, సీనియర్ అధికార ప్రతినిధి అల్ దాస్ జానయ్య కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. టీపీసీసీ ఇంటలెక్చువల్ సెల్ చైర్మెన్ ఎ.శ్యాం మోహన్, మాజీ ఎమ్మెల్సీ బి.కమలాకర రావు, పీసీసీ ఎన్నారై సెల్ చైర్మెన్ అంబాసిడర్ డాక్టర్ బి.ఎం.వినోద్ కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ రియాజ్, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.జనక్ ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.