రేేషన్‌ డీలర్లతో చర్చలు సఫలం.. సమ్మె విరమణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమ్మె బాట పట్టిన రేషన్‌ డీలర్ల సంఘాల నాయకులతో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో రేషన్‌ డీలర్ల జేఏసీ ఛైర్మన్‌ నాయికోటి రాజు ఇతర నేతలతో డిమాండ్లపై చర్చించారు. చర్చల అనంతరం తాము సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. కమిషన్‌ పెంపు ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌ దష్టికి తీసుకెళ్తానంటూ మంత్రి ఇచ్చిన హామీ పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌, చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ బాలమాయాదేవి, జాయింట్‌ కమిషనర్‌ ఉషారాణి, ఇతర ఉన్నతాధికారులు, రేషన్‌ డీలర్ల జేఏసీ చైర్మెన్‌ నాయికోటి రాజు, కన్వీనర్‌ రవీందర్‌, కో కన్వినర్‌ మల్లిఖార్జున్‌ గౌడ్‌, గౌరవాధ్యక్షులు అనంతయ్య, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు పుస్తె శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love