ఎంఎస్‌ఎంఈల కోసం కొత్త బీమా ప్లాన్లు

ఐసీఐసీిఐ లాంబార్డ్‌ వెల్లడి
ముంబయి:సాధారణ బీమా కంపె నీల్లో ఒక్కటైన ఐసీఐసీఐ లాంబార్డ్‌ కొత్త గా చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల కోసం మూడు వినూత్న బీమా పథకాలను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఇ దినోత్సవం సందర్భంగా ఎంఎస్‌ఎంఇ సురక్షా కవచ్‌ పాలసీ, ప్రాపర్టీ ఆల్‌ రిస్క్‌, ఐ- సెలెక్ట్‌ లయబిలిటీ పాలసీలను విడుదల చేశామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మంత్రి తెలిపారు. విపత్తులు, ప్రమా దాలు, ఆస్తి నష్టాల వల్ల కలిగే నష్టాలను ఇవి పూడ్చుతాయని పేర్కొన్నారు.

Spread the love