ప్యూచర్‌ జెనరల్లీ నుంచి డిఐవై హెల్త్‌ పాలసీ

ముంబయి : ప్యూచర్‌ జెనరాలి ఇండియా కొత్తగా డిఐవై హెల్త్‌ పాలసీని ఆవిష్కరించింది. గురువారం ఆ సంస్థ ఎండి, సిఇఒ అనూప్‌ రౌ వర్చూవల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. ఈ సరికొత్త పాలసీ ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిందన్నారు. 20 మాడ్యులర్‌ ఫీచర్లతో దీన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ హెల్త్‌ పాలసీలో బీమా మొత్తానికి సమగ్ర కవరేజీ, రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ పొందడానికి వీలుందన్నారు. గరిష్టంగా 15 మంది కుటుంబ సభ్యులకు కవరేజీ పొంద వచ్చన్నారు. వినియోగదారులు వారి జీవిత అవసరాలకు అనుగుణంగా అత్యంత ఆవశ్యకమైన ఫీచర్‌లను ఎంచుకోవడానికి వీలుందన్నారు.

Spread the love