ఏసర్‌ గూగుల్‌ టివిల విడుదల

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ ఏసర్‌ ద్వారా కొత్త గూగుల్‌ టివిల శ్రేణీని భారత్‌లో విడుదల చేసినట్లు ఇండ్‌కల్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. ఒఎల్‌ఇడి డిస్‌ప్లేతో కూడిన ఫ్లాగ్‌షిప్‌ ఓ సిరీస్‌, భారీ వూఫర్‌లు ఉన్న 60 వాట్‌ స్పీకర్‌ సిస్టమ్‌తో వీటిని ఆవిష్కరించినట్లు తెలిపింది. 55, 65 అంగుళాల వేరియంట్లు సహా 32, 43, 50 అంగుళాల పరిమాణంలోనూ లభిస్తాయని వెల్లడించింది. ఏసర్‌ నుంచి వచ్చిన ఈ శ్రేణీలో హెచ్‌డిఎంఐ 2.1 పోర్ట్‌లు, యుఎస్‌బి 3.0తో డ్యూయల్‌-బ్యాండ్‌ వైఫె, 2-వే బ్లూటూత్‌ 5.0, డాల్బీ అట్మాస్‌ తదితర ఫీచర్లున్నట్లు తెలిపింది.

Spread the love