ఏఐతో 90 శాతం ఉద్యోగాలు ఫట్‌

– స్టార్టప్‌ దుకాన్‌లో సిబ్బందికి ఎసరు
న్యూఢిల్లీ : వ్యాపారులు తమ స్వంత ఇ-కామర్స్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసుకోవడానికి మద్దనిచ్చే స్టార్టప్‌ సంస్థ దుకాన్‌ తమ ఉద్యోగుల్లో 90 శాతం మందికి ఉద్వాసన పలికింది. వీరి స్థానంలో కృత్రిమ మేథా(ఏఐ)ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. కస్టమర్‌ సపోర్ట్‌ టీమ్‌లో 90 శాతం ఉద్యోగుల స్థానంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌తో రిప్లేస్‌ చేస్తున్నట్లు దుకాన్‌ పౌండర్‌, సిఇఒ సుమిత్‌ షా సోషల్‌ మీడియాలో వెల్లడించారు. దీంతో తమకు 85 శాతం ఖర్చులు తగ్గనున్నాయన్నారు. సుమిత్‌ షా నిర్ణయంపై ట్విట్టర్‌లో ఆయనపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇది సిగ్గు, మానవత్వం లేని చర్య అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్వాసనలు
టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మరోమారు తొలగింపులు చోటు చేసుకోనున్నాయని రిపోర్ట్‌లు వస్తోన్నాయి. ఇప్పటికే 10వేల మందికి ఉద్వాసన పలుకుతున్నామని ఈ ఏడాది ప్రారంభంలో ఆ కంపెనీ ప్రకటించింది. వీటికి అదనంగా మరోమారు కోతలకు సిద్దం అవుతోందని తెలుస్తోంది. తాజా తొలగింపుల్లో భాగంగా వాషింగ్టన్‌ కార్యాలయంలోని ఉద్యోగుల్లో 276 మందిని ఇంటికి పంపించిందని సమాచారం. రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యోగుల తొలగింపులు ఉండొచ్చని రిపోర్ట్‌లు వస్తోన్నాయి.

Spread the love