ముంబయి : మే 16న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కేంద్రానికి ఎంత మొత్తం డివిడెండ్‌ను చెల్లించాలనే దానిపై నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ముంబయిలో భేటీ జరగనుందని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు పేర్కొన్నట్లు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. 2023 మార్చి 31తో ముగిసిన ఏడాదికి గాను కేంద్రానికి రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల మేర డివిడెండ్‌ను ప్రకటించే అవకాశం ఉందని స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా వేసింది. ఇంతక్రితం ఏడాది రూ.30,310 కోట్ల డివిడెండ్‌ను అందించింది.