శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ గోల్డెన్‌ జూబ్లీ ప్లాన్‌

ముంబయి : శ్రీరామ్‌ గ్రూప్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల సందర్బంగా కొత్త బీమా పాలసీని ప్రారంభించినట్లు ప్రకటించింది. శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించిన ఈ ఈ ప్లాన్‌ ఒక యూనిట్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్లాన్‌ అని పేర్కొంది. ఇది పాలసీ హోల్డర్లు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుందని పేర్కొంది. లైఫ్‌ గోల్‌ (నిర్దిష్ట కాలానికి కవర్‌ని అందించడం), లెగసీ (100 ఏళ్ల వరకు కవర్‌ని అందిస్తోంది) లాంటి రెండు రకాల బీమాను అందిస్తుందని తెలిపింది. లెగసీ ఎంపిక ఖాతాదారులు వారి జీవితాంతం పెట్టుబడి పెట్టడానికి, వారి ప్రియమైన వారి కోసం పెద్ద మొత్తంలో సంపదను అందించడానికి అనువైనదిగా రూపొందించ బడిందని శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండి, సిఇఒ కాస్పరస్‌ క్రోమ్‌హౌట్‌ తెలిపారు. ఈ ప్లాన్లు ఆర్థిక రక్షణను అందించడంతో పాటుగా మార్కెట్‌లో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.

Spread the love