రెండో రోజూ మార్కెట్ల నేల చూపులు

– సెన్సెక్స్‌ 372 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలు చవి చూశాయి. అమెరికా లో రుణ సంక్షోభం చోటు చేసుకో నుందనే అంచనాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 372 పాయింట్లు కోల్పోయి 61,561కు పడిపోయింది. రెండు సెషన్లలో ఈ సూచీ దాదాపు 900 పాయింట్ల మేర నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 105 పాయింట్ల నష్టంతో 18,115 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌-30లో ఆసియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు అధికంగా 1-2 శాతం వరకు నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ సూచీ 0.2 శాతం తగ్గగా.. స్మాల్‌ క్యాప్‌ 0.3 శాతం పెరిగింది.

Spread the love