గురుగావ్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి పలు నూతన ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో గెలాక్సీ ఫోల్డబుల్స్ ఐదవతరం, వాచ్ 6సిరీస్, టాబ్ ఎస్9 సిరీస్‌లు ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. గెలాక్సీ వాచ్6, క్లాసిక్‌లను ఆవిష్కరించింది. ఈ రెండింటి ధరలను వరుసగా రూ.29,999గా, రూ.36,999గా నిర్ణయించింది. ట్యాబ్ ఎస్ సీరిస్‌లో అల్ట్రా, ఎస్9 ఫ్లస్, ఎస్9 వేరియంట్లను విడుదల చేయగా.. వీటి ధరలను రూ.1,19,999గా, రూ.90,999గా, రూ.96,999గా ప్రకటించింది. ఆయా ఉత్పత్తులపై పలు రాయితీలను అందిస్తున్నట్టు తెలిపింది.