పూణె యాక్సిడెంట్ కేసులో కొత్త మలుపు.. ఇద్దరు డాక్టర్లు అరెస్టు

నవతెలంగాణ – పూణె: గత ఆదివారం మద్యం మత్తులో ఉన్న ఓ టీనేజర్ ఖరీదైన పోర్ష కారును వేగంగా నడిపి ఇద్దరిని ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు రోజుకో కొత్త మలుపులు తిరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, యాక్సిడెంట్ జరిగిన రోజు ఉదయం 11 గంటలకు నిందితుడిని వైద్య పరీక్షల కోసం ససోన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాద సమయంలో టీనేజర్ మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపణలు వస్తున్నా.. అతడి రక్తంలో ఆల్కహాల్ లేనట్టు ఫారెన్సిక్ రిపోర్టు విడుదల చేశారు. ఆ తరువాత రెండో రిపోర్టులో మాత్రం నిందితుడి రక్తంలో మద్యం ఉన్నట్టు వెల్లడైంది. తదనంతరం జరిపిన డీఎన్ఏ పరీక్షల్లో ఈ రెండు శాంపిళ్ల వేర్వేరని వెల్లడైంది. దీంతో, ఆధారాలు తారుమారు చేసిన ఆరోపణలపై ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. శాంపిళ్ల తారుమారులో వైద్యుల పాత్ర ఏమిటో తేల్చేందుకు పూణె క్రైమ్ బ్రాంచ్ వారిని విచారిస్తోంది.

 

Spread the love