పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లో ఎన్‌ఐఏ సోదాలు

నవతెలంగాణ – ఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్‌ గ్యాంగ్‌స్టర్లకు సంబంధాల కేసులో పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏక కాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేషన్‌లో భాగం అయ్యాయి. ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Spread the love