నిరంజన్ రెడ్డి ఫిలిం డాక్యుమెంటరీ

నవతెలంగాణ-రేవల్లి
కొంకలపల్లి గ్రామంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల ఫిలిం డాక్యుమెంటరీ చిత్రం రాత్రి ప్రజలకి చూపించడం జరిగింది. ఫిలిం చూసిన గ్రామస్తులు తాను చేసిన కార్యక్రమాలు నిజమేనని, ఎంత కష్టం వచ్చినా వనపర్తి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఇప్పటివరకు చూడలేదని అన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఏ ఎమ్మెల్యే వల్ల వనపర్తి జిల్లాకు సరిగా నిధులు రాలేదు, పనులు కాలేదు, కానీ నిరంజన్ రెడ్డి వల్ల అయింది అని ఆనంద వ్యక్తం చేశారు, జెడ్పిటిసి భీమయ్య మాట్లాడుతూ  మళ్లీ వనపర్తి నియోజకవర్గం నిరంజన్ రెడ్డి  రావాలంటే గ్రామస్తుల యొక్క ఆశీస్సులు ఉంటే తప్పకుండా ఆయనే గెలుస్తాడని మీ కోరికలు నెరవేరుతాయి అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సేనాపతి, కుంకలపల్లి సర్పంచ్ జగదీష్, ఏఈ శ్రీశైలం, టిఆర్ఎస్ నాయకులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love