నిర్మల్‌ జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసీ ఆమోదం

– మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిర్మల్‌ జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసీ ఆమోదం లభించడం పట్ల మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు 100 మెడికల్‌ సీట్ల ప్రవేశానికి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రాథమిక అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, ప్రత్యేక చొరవ చూపిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావుకు ఆయన కతజ్ఞతలు తెలిపారు. 2023- 2024 నుంచి మెడికల్‌ కాలేజీలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఇంద్రకరణ్‌ రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రం నిర్మల్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేయటంతో నిధులతో పాటు స్థలం కూడా కేటాయించిందని గుర్తు చేశారు.

Spread the love