ధూమ్‌ ధామ్‌ గా తెలంగాణ అవతర నోత్సావం..

నవతెలంగాణ-కల్చరల్‌
భారత్‌ ఆర్ట్స్‌ అకాడెమీ, ఏ బి సి ఫౌండేషన్‌ ల సంయుక్త అధ్వర్యంలో త్యాగరాయ గానసభలో తెలంగాణ ధూంధాం, తెలంగాణ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌, తెలంగాణ కిరణం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏ బి సి ఫౌండేషన్‌ అధ్యక్షుడు లయన్‌ కె.వి.రమణారావు, భారత్‌ ఆర్ట్స్‌ అకాడెమీ అధ్యక్షురాలు లయన్‌ లలితారావు ఆధ్వ ర్యంలో జరిగింది. తెలంగాణ సంస్కతి సాంప్రదా యాలు ప్రతిబింబించే విధంగా వివిధ రకాల నృత్యంశాలు నత్య కళాకారులు ప్రదర్శించారు. ముఖ్య అతిథిóగా తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కొల్లేటి దామోదర్‌ గుప్తా హాజరై అవార్డులను ప్రదానం చేసి ప్రసంగించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పోలీసు ఉన్నతాధికారి రామ్‌ దాస్‌ తేజావత్‌, టీవీ యాంకర్‌ బాలాజీ, ప్రముఖ నృత్య గురువు ఓలేటి రంగమని, మేము సైతం యువసేన ఫౌండేషన్‌ అధ్యక్షురాలు చక్కిలం స్వప్న, నత్య గురువులు ఓలేటి రేఖ, విజ యలక్ష్మి, అంజనా దేవ్‌, మౌనిక, అచ్యుతాంబ, ఆశ, శ్రీ రంగాచార్య మ్యూజిక్‌ అకాడమీ అధినేత్రి, ప్రముఖ సంగీత విద్వాంసురాలు విష్ణు ప్రియ, సంగీత ఉపాధ్యాయులు లలిత, అంజన, హిమబిందు, పాశ్చత్య సంగీత కళాకారులు సంపత్‌, చింటూ, ప్రవీణ్‌ , అర్జున్‌ తదితరులు తమ శిష్య బృందంతో కలిసి నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధ్యక్షుడు లయన్‌ కె.వి.రమణారావు సభాద్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొల్లేటి దామోదర్‌ గుప్తా మాట్లాడుతూ భారత్‌ ఆర్ట్స్‌ అకాడెమీ ఏ బి సి ఫౌండషన్స్‌ లు ప్రత్యేకంగా రాష్ట్ర ఖ్యాతిని చాటే సాంప్రదాయ నత్యమైన పేరిణి నాట్య ప్రదర్శ నలు ప్రోత్సాహిస్తున్నారన్నారు. నిర్వాహకులను అభి నందించారు. సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, తెలం గాణ భాషా సాంస్కతిక శాఖ ఉప సంచాలకులు రఘు నందన రావులు నిర్వాహకులను అభినందించారు.

Spread the love