ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం

– పనామా చౌరస్తాకి ఎన్టీఆర్‌ చౌరస్తాగా నామకరణం
– ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-వనస్థలిపురం
తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మహౌన్నత శక్తి నందమూరి తారకరామారావు శతజయంతిని ఆదివారం ఘ నంగా నిర్వహించారు. ఆదివారం కమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వ ర్యంలో గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ మాజీ సభ్యులు అనిల్‌ చౌద రి నేతృత్వంలో వనస్థలిపురం డివిజన్‌ పరిధిలోని పనామా చౌర స్తా వద్ద ఎల్బీనగర్‌ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్‌ రెడ్డి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ మనవడు చైతన్య కృష్ణ సమక్షంలో ఎమ్మెల్యే పనామా చౌరస్తాను ఎన్‌.టీ.ఆర్‌.చౌరస్తాగా మారుస్తూ నామకరణం చేశారు. ఈ సంద ర్భంగా సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌.బి.నగర్‌ నుంచి ఆరు వరసల రోడ్డు మంజూరైనట్లు, రోడ్డు పనుల్లో భాగంగా పనామా దగ్గర ఉన్న ఎన్‌.టీ.ఆర్‌.విగ్రహం తొలగించాల్సిన వస్తే గనుక ఎన్ని అవాంతరాలు వచ్చిన దగ్గరుండి పెద్ద విగ్రహం చేయిస్తాను అని హామీ ఇచ్చారు. అలాగే దుర్గ విలాస్‌ దగ్గర నుంచి డి మార్ట్‌ వరకు నూతన ఫ్లై ఓవర్‌ మంజూరైనట్లు, ఫ్లై ఓవర్‌ కింద అందమైన వాటర్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు చేసి,దాని కింద స్వర్గీయ ఎన్‌.టీ.ఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ జిట్టా రాజశేఖర్‌ రెడ్డి,వనస్థలిపురం డివిజన్‌ బారాస పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్‌ గుప్తా,బి.ఎన్‌.రెడ్డి.నగర్‌ డివిజన్‌ బారాస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్‌ రెడ్డి,కర్మన్‌ ఘాట్‌ హనుమాన్‌ దేవాలయం మాజీ ఛైర్మన్‌ ఈశ్వరమ్మ యాదవ్‌,యలమంచిలి భాను ప్రసాద్‌,నూతి శ్రీనివాస్‌ రావు,కర్నాటి కృష్ణా మూర్తి,బాలాజీ నాథ్‌,దొడ్డ రఘు,యూ.వి.ఎన్‌.బాబు,గడింపర్తి గోవర్ధన్‌,బోళ్ల శ్రీకాంత్‌,మువ్వ సతీష్‌,వెంపటి నరసింహ రావు,మండవ హితేష్‌,వేముల పృథ్వి,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు చీరలు పంపిణీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నం దమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా వనస్థలిపురం కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో వనస్థలిపురం ఎన్టీఆర్‌ చౌరస్తా ( పనామాచౌరాస్తా) వద్ద పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమంలో ఎల్బీనగర్‌ బిఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జి శ్రీ ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్లు సామరమణారెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, ముద్దగౌనిలక్ష్మి ప్రసన్న రామ్మోహన్‌ గౌడ్‌ పాల్గొని స్వర్గీయ ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నిరుపేద మహి ళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం కమ్మ సేవా సంఘం ప్రతినిధులు దొడ్డా రఘురామ్‌, బొల్లినేని రాజేష్‌, ఉప్పలపాటి రాజా, పరుచూరి రాజేంద్ర ప్రసాద్‌, వలేటి సాంబయ్య, చల్ల ప్రసాద్‌, దుబారు రాజా, పాలడుగు ప్రసాద్‌, వేణు,పరుచూరి ప్రవీణ్‌, నూతి శ్రీనివాసరావు, ప్రసాద్‌, గాడిపర్తి రాధాకృష్ణ, తోకల మాధవరావు, చల్లా వెంకటరత్నం, గోవర్ధన్‌ చౌదరి, సూరా వెంగళరావు బిఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌ టీడీపీ అధ్యక్షులు గద్దెవిజరు నేత, నాయకులు పంగ శ్యామ్‌ కుమార్‌, కత్తుల రాంబాబు, యం యస్‌ కుమార్‌, ఉమా శ్రీనివాస్‌, కాయల నాగరాజు ముదిరాజ్‌, జువ్వగాని రాజు గౌడ్‌ , చెన్నగొని మదన్‌ గౌడ్‌, యస్‌ కె మహ్మద్‌, హరిప్రసాద్‌, పండాల రాజశేఖర్‌ గౌడ్‌, పాశం శ్రీకాంత్‌, పద్మనాయీ ,పల్లె కృష్ణ గౌడ్‌ , నీళ్ల అశోక్‌ గౌడ్‌ , సూరిబాబు, తిరుమల రెడ్డి , వీరన్న యాదవ్‌, జాఫర్‌ భారు ,ఖాజా శ్రీనివాస్‌ , విశాల్‌ , రేవతి, స్వప్న, వాణీ, బోదాసు పెంటయ్య, శ్రీనివాస చారి , సల్వా చారి,యాదగిరి, నరసింహా గౌడ్‌ తదితరులున్నారు.
ఎన్టీఆర్‌ విగ్రహానికి పలువురు నేతలు నివాళులు
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆది వారం పనామా చౌరస్తాలో ఎన్టీఆర్‌ విగ్రహానికి రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, బియన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌ జిహెచ్‌ఎంసి కార్పొరేటర్‌ మొద్దు లచ్చిరెడ్డి, మనసురాబాద్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ కొప్పుల నరసింహారెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్‌ రాగుల వెంకటేశ్వర్‌ రెడ్డి లు పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులుఅర్పించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్‌ అధ్యక్షులు నూతి శ్రీనివాస్‌, నాయకులు , శ్రీకాంత్‌, గోవర్ధన్‌, రాజు, తిరుపతి రెడ్డి, మురళీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love