మోపాల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం

నవతెలంగాణ మోపాల్: మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి గ్రామంలో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్హాల్లో బారాస ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా దర్పల్లి జెడ్పిటిసి, ఒలంపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాజీ రెడ్డి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్లలో కూడా మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని అత్యంత బాజీ మెజార్టీతో గెలిపించుకోవాలని మన రూరల్ నియోజకవర్గ సీటును కేసీఆర్ కి కానుకగా ఇవ్వాలని ఆయన సూచించారు 50 రోజుల మనం ఒక బారాస కార్యకర్తలు అందరం ఒక సైనికుల పని చేయాలని అలాగే మన సంక్షేమ పథకాలన్నీటిని గ్రామంలో గల యువకుల గాని ఇంటింటికి ప్రచారం చేయాలని, దాదాపుగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ గ్రామంలో ప్రతి ఇంటికి చేరాయని వాటి గురించి వారికి వివరించాలని అలాగే ముఖ్యంగా పింఛన్ గురించి రైతుబంధు గురించి ఆడవారికి, గ్రామంలో ఉండే రైతులకు తెలియచెప్పాలని ఆయన కోరారు. ఒక్క క్షణం కూడా మనం వృధా చేయకుండా పార్టీ కోసం కష్టపడాలని పార్టీ బాగుంటే కార్యకర్తలు బాగుంటారని ఆయన తెలిపారు. ఎన్ని రోజులు పార్టీ, ప్రభుత్వం మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది ఇచ్చింది. ఇప్పుడు మనమందరం కష్టపడి పార్టీకి విజయం అందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా మోపాల్ మండలంలోని వివిధ  తండాలకు గ్రామపంచాయతీలో హోదా ఇచ్చారని అది కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని తండాలో ఉండే నివసించే ప్రజలకు తమ గ్రామపంచాయతీ అవడం వల్ల కలిగే నటువంటి లాభాల గురించి తెలియ చెప్పాలని, కొందరు మన ప్రియతమ నాయకుడు బాజీరెడ్డిని, ముఖ్యమంత్రి తిడుతూ ఉంటారని వారి మాటలను ఆశీర్వాదంగా తీసుకొని అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి గెలిచి మన సత్తా చూపించాలని ఆయన కార్యకర్తల ఉద్దేశించి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ లతా కన్నీరాం మాట్లాడుతూ ఖమ్మంలో ఉండే సర్పంచులు,  ఎంపీటీసీలు మన బారసాసైనికులు కచ్చితంగా ప్రతి ఇంటికి మన ప్రభుత్వ సంక్షేమ ఫలాల కరపత్రం వెళ్లాలని నా ప్రియతమ ముఖ్యమంత్రి, మన ప్రియతమ ఎమ్మెల్యే చేసిన పనుల గురించి ప్రతి ఒక్కరికి వివరించాలని, ప్రభుత్వ పథకాలు కేవలం బారాస వాళ్ళకి కాకుండా ప్రజలందరికీ అలాగే ఇతర పార్టీలకు కూడా అందించామని వారు కూడా ఆకర్షితులయ్యారని ఈ సందర్భంగా ఇంతకుముందు ఎలక్షన్లో ఓటు వేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈసారి గోవన్న కు ఓటేస్తారని వచ్చే ఎన్నికల్లో మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన నాయకులనుదేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షుడు మోచ్చ శ్రీనివాస్, ఎస్సీ సెల్ కన్వీనర్ కంజర భూమయ్య సర్పంచులు సిద్ధార్థ, ముత్యం రెడ్డి శ్రావణ్, సాయి రెడ్డి, క్యాతం రవి, సీనియర్ నాయకులు రాజ రెడ్డి, ఉమాపతి రావు, నిమ్మల మోహన్ రెడ్డి, రమేష్, ముట్టెన్న, తదితరులు పాల్గొన్నారు.

Spread the love