నిమ్మలవాణికుంట బఫర్‌లో ఆగని అక్రమ భవన నిర్మాణం

– చోెద్యం చూస్తున్నారంటూ రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులపై ఆరోపణలు
– సెమస్యను పత్రికల ద్వారా అధికారుల దష్టికి
– తీసుకెళ్లినా తూతూ మంత్రంగా చర్యలు
– అయినా ఆగని ఆక్రమ నిర్మాణం
నవతెలంగాణ-దుండిగల్‌
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం దుండిగల్‌ మున్సిపా లిటీ పార్టీ పరిధిలోని బౌరంపేట్‌ పరిధిలోని సర్వే నెంబర్‌ 660 నిమ్మలవాణికుంట 1ఎకరా 15 గుంటలు శిఖం భూమి ఉంది. దాని పక్కన కీర్తి హౌమ్స్‌ పేరిట విల్లాల నిర్మాణం చేపట్టిన సమయంలో ఈ స్థలం జోలికి వెళ్లకుండా తమ పరిధిలలోనే నిర్మించుకున్నారు. ఐదేం డ్లుగా ఆ స్థలంలో ఎలాంటి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు జరగలేదు. ఇటీవల నిమ్మలవాణికుంట బఫర్‌లో 150 గజాల స్థలంలో ఓ వ్యక్తి భవన చేపట్టడంతో ఆ అక్రమ నిర్మాణంపై వివిధ పత్రికల్లో వార్తలు రావడంతో విషయం రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల దష్టికి వెళ్లింది. దీంతో అధికారులు నిమ్మలవాణికుంటను సర్వేయర్‌తో పరిశీలిస్తే బఫర్‌లోనే కొనసాగుతున్నట్లు తెలింది. ఆ నివేదికతో రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్‌ అధికారులు అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని నిలిపేశారు. 15 రోజులు స్తబ్దతగా ఉన్న భవన నిర్మాణదారుడు మళ్లీ పనులు చేపట్టడంపై స్థానికులు విస్మయం చెందుతున్నా రు. గ్రామపంచాయతీ హయాంలో సర్వే నెంబర్‌ 660 గా ఉన్న నిమ్మలవాణికుంట అధికారులు మాత్రం 667 సర్వే నెంబర్‌తో సూచించి కొంత స్థలం మాత్రమే బఫర్‌లో వస్తుందని తెలపడంతో ఇరిగేషన్‌, రెవెన్యూ, సర్వేయర్‌ ఒకరిపై ఒకరు దాటవేత ధోరణితో వ్యవహరిం చడం వల్ల నిర్మాణదారుడు ఆపివేసిన భవన నిర్మాణాన్ని మళ్లీ మొదలు పెట్టాడు. బౌరంపేట్‌లో నిమ్మల వాణికుంటలో భవన నిర్మాణం పనులు జరుగుతున్నా అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్హం. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల తీరును స్థానికులు విమర్శిస్తున్నారు. కుంటలు చెరువు శిఖం భూమిని కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తే భవిష్యత్తులో నిమ్మలవాణికుంటలో మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలుస్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు శిఖం భూముల్లో రానున్న రోజుల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అధికారులు చర్యలు చేపట్టాలని, నిమ్మలవాణికుంట స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. నిమ్మలవాణికుంట చర్యలపై ఆర్‌ఐ భారతిని మీడియా వివరణ కోరగా భవన నిర్మాణం జరుగుతున్నది వాస్తవమే కొద్దిగా బఫర్‌లో వచ్చేటట్లుగా ఉందని సర్వేయర్‌ తనకు దృష్టి తెచ్చారని తెలిపారు. జాయింట్‌ యాక్షన్‌ టీంతో పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Spread the love