అప్పు తీర్చమంటే కోరిక తీర్చమన్న డాక్టర్

– డాక్టర్ వేధించాడని ఉరివేసుకొని ఉద్యోగి ఆత్మహత్య
– నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
– న్యాయం చేయాలంటూ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ వేధించడంతో తన కూతురు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ముదక్ పల్లి గ్రామానికి చెందిన గౌతమి (21) నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సిస్టర్ గా పనిచేస్తుంది. అయితే అవసరం నిమిత్తం ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఓ డాక్టర్ వద్ద 80 వేలు అప్పుగా తీసుకోంది. దీంతో ఆస్పత్రి డాక్టర్ అప్పు తీర్చాలంటు తరచూ వేధించేవాడని గౌతమి తల్లి లక్ష్మీ ఆరోపించింది. తన కూతుర్ని మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధించేవాడని, డాక్టర్ వేధింపులు భరించలేకనే తన కూతురు శుక్రవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు మృతికి ఆస్పత్రిలో విధులు నిర్వహించే డాక్టర్ రే కారణమని ఆరోపించింది. న్యాయం జరిగేంతవరకు తాము ఇక్కడే నిరసన చేపడతామని భీష్మించు కూర్చున్నారు. సంబంధిత డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
మా హాస్పిటల్ వైద్యుడు అలా మాట్లాడలేదు
హాస్పిటల్ వైద్యుడు కట్ట నరసింహ
మా హాస్పిటల్ లో పనిచేసే నర్సు గౌతమి అందరితో మంచిగా ఉండేదని తన అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకుందని నేను చొప్పున డబ్బులను కడుతుందని తెలిపారు. కానీ తన కుటుంబ సభ్యులలో తన తల్లి మాత్రం డాక్టర్ పై నింద వేయడం సమంజసం కాదని భావిస్తున్నామన్నారు. ఒకవేళ డాక్టర్ తప్పు చేసి ఉంటే ఈ విషయం ఎప్పుడో బయటపడేది ఏదేమన్న పోలీసులు నిజనిర్ధారణ చేయాలని తమ హాస్పిటల్ ద్వారా కోరుతున్నామన్నారు.

Spread the love