సాఫ్ట్ బాల్ జట్టు ఆధ్వర్యంలో క్రీడాకా రీ నికి సన్మానం

నవతెలంగాణ- ఆర్మూర్  
హైదరాబాదులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 8 వరకు చైనా దేశంలో జరగనున్న ఏషియన్ గేమ్స్ లో భారత సాప్ట్ బాల్ జట్టుకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని  గూగులొత్ మమత (సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ ప్రిపరెటరీ డిగ్రీ మహిళకళాశాల  భువనగిరి) ఎంపికైన సందర్భంగా బుధవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ ఘనంగా సన్మానించారు. ఏషియన్ గేమ్స్ భారత సాఫ్ట్ బాల్ జట్టులో ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈనెల 18 నుంచి 30 వరకు ఢిల్లీలో స్పెషల్ శిక్షణ శిబిరంలో పాల్గొని నూతన మెలకువలు నేర్చుకొని భారత  సాఫ్ట్ బాల్ జట్టులో ఉత్తమ ప్రతిభను చూపాలి అన్నారు. భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ రామ లక్ష్మయ్య, నోడల్ స్పోర్ట్స్ ఆఫీసర్ కుమారి, నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పి. నీరజ రెడ్డి, నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love