జిల్లాలోనే బెస్ట్ సహకార సంఘం..

– సూక్ష్మ తరహా రుణాలు ఇవ్వడానికి సిద్ధం..
– అసైన్డ్ భూములపై రూణాలు ఇవ్వాలని తీర్మాణం..
– రైతులను వేన్నంటే  సహకార సొసైటీ..
– సోసైటి చైర్మెన్ గోవర్ధన్ రెడ్డి..
నవతెలంగాణ-డిచ్ పల్లి : జిల్లాలోనే బెస్ట్ సహకార సంఘంగా ఏర్పడటానికి  రైతులతో కలిసి పాలకవర్గం కృషి చేస్తుందని, సహకార సొసైటీ లో సూక్ష్మ తరహా రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అవసరం ఉన్నా వారు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సహకర సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి అన్నారు.మంగళవారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామం 99వ మహాజన సభా ఏర్పాటు చేశారు.ఈసందర్బంగా సహకార సొసైటీ సిఈఓ ఉప్పల్ వాయి రతన్ గత అరు నేలల వ్యవధిలో సహకార సొసైటీ కి వచ్చిన జామ ఖర్చులను సభా దృష్టికి చదివి వినిపించారు. అసైన్మెంట్ భూములు,ఇతర భూములకు గతంలో రూణలను అందజేశామని, సోసైటి లో నియామ నిబంధనల మేరకు నేడు పట్ట భూములకు మాత్రమే రూణలను అందజేస్తున్నమని,అలా కాకుండా అన్ని భూములకు రూణలను అందజేయడానికి మహాజన సభా లో ఏకగ్రీవంగా తీర్మానించరని, తీర్మానం చేసిన పత్రాలను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.బిఅర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షాపతని, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షాపతని, రైతన్నలకోసం సహకార సొసైటీ వెన్నంటే ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఇందల్ వాయి సహకార సొసైటీ లో 695 మందికి రైతులకు గాను1 కోటి50 లక్షల రూపాయలు రుణమాఫి అయ్యిందని, మిగిలిన వారికి త్వరలో మాఫీ అయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు అవసరాలకు అనుగుణంగా రైతు అవసరాల మేరకు నూతనంగా రుణాలు అందజేయడానికి సిద్ధం గా ఉన్నామని సోసైటి లో ఒక ఎకరానికి 45వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. సహకార సొసైటీలో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు ప్రకటించిన కటఫ్ తేది లోన తీసుకున్న రైతులకు ఈ నేలా చివరి వరకు తమ తమ ఖాతాల్లో జమ అవుతాయని, రైతులు ఎవ్వరూ అధైర్య పడోదన్నారు. సోసైటి అధ్వర్యంలో ఒక పెట్రోల్ బంక్,లేక ఒక పేద్ద రైస్ మిల్ నేలకోల్పడానికి అవకాశం వచ్చిందని త్వరలోనే నిర్ణయం తీసుకొని ఎదైనా ఒకటి సోసైటి పరిదిలో నేలకోల్పడానికి కృషి చేస్తామని చైర్మన్ అన్నారు.సోసైటి పరిధిలో ఉన్న రైతులు సోసైటికి వచ్చి రుణాలు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమం లో సహకార సొసైటీ వైస్ చైర్మన్ మారుతి, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్,చిలువెరి దాస్, లోకాని గంగారాం, డైరెక్టర్లు, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Spread the love