పోషకాలు వల్ల ఆరోగ్యానికి మేలు 

నవతెలంగాణ – అశ్వారావుపేట
మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే శరీరానికి పోషకాలు అవసరం పడతాయని స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు సీ.డీ.పీ.వో రోజా రాణి అన్నారు. జాతీయ పోషకాహార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని ఆసుపాక అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన పెరటి తోటలోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఇచ్చే ఆకు కూరలు, కూరగాయలు పండించుకోవచ్చన్నారు.వీటి ద్వార మనం పోషకాహారం తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కె.లింగయ్య, ఉపసర్పంచ్ తల్లాడి వెంకటేశ్వరరావు, హెచ్.ఎం రాంబాబు,సూపర్వైజర్ స్వరాజ్యం, వార్డు సభ్యులు ఎస్కే బేగం, కొత్తపల్లి వెంకాయమ్మ, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, సునీత, సావిత్రి, తల్లులు, గర్భవతులు, చిన్నారులు పాల్గొన్నారు.
Spread the love