విద్య, ఉపాధి అవకాశాల్లో ఓబీసీ 27% కోటను అమలు పరచాలి..


నవతెలంగాణ డిచ్ పల్లి: కేంద్ర ప్రభుత్వం 2014 నుండి ఐసీఎస్ఎస్ఆర్ నిధుల ద్వారా నిర్వహించే విద్య, ఉపాధి అవకాశాలలో ఓబీసీ లకు 27% శాతం కోటాను అమలు చేయాలని తెలంగాణ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాదల్ లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అదివారం యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2014 నుండి ఐసీఎస్ఎస్ఆర్ నిధుల ద్వారా నిర్వహించే విద్య ఉపాధి అవకాశాలలో ఓబీసీ 27%శాతం కోటాను అమలు పరచకపోవడంతో చాలా మంది పరిశోధక విద్యార్థులు పరిశోధనలకు ఆర్థిక తోడ్పాటుకు దూరమయ్యారని పేర్కొన్నారు. అదేవిధంగా సెమినార్స్, వర్క్ షాప్స్ మైనర్, మేజర్ ప్రాజెక్టులలో ఓబీసీ కోట అమలు పర్చకపోవడం వల్ల ఓబీసీ అధ్యాపకులకు తీవ్ర మైన అన్యాయం జరిగిందని, కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ఇప్పటికైనా స్పందించి బీజేపీ ప్రభుత్వానికి ఓబీసీ కోటను సంపూర్ణంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం సభ్యులు శివకుమార్, సంతోష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love