– విరిగిపడిన కొండచరియలు
ముంబయి : భారీ వర్షాలతో మహారాష్ట్ర రాజధాని ముంబై తడిసిముద్దవుతున్నది. మహారాష్ట్రతో పాటు గుజరాత్‌లోనూ కుండపోతతో జనజీవనం అస్తవ్యస్ధమైంది. ఇక ముంబయి – పూణె ఎక్స్‌ప్రెస్ వే కంషెట్ టన్నెల్ వద్ద గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు శిధిలాలను తొలగిస్తున్నారు. ముంబయిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొరుగున థానే, రారుగఢ్ జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతున్నది.