నవతెలంగాణ-వీణవంక
మండలంలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై ఎండీ ఆసీప్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని మామిడాలపల్లికి చెందిన సిరిపురం శ్రీనివాస్ పై 2014 లో కేసు నమోదైంది. కాగా అతడు కోర్టుకు హాజరు కానందున అతడిని అరెస్టు చేసి కోర్టులో మళ్లీ హాజరు పరుచగా జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ కు విధించగా జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.