మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ఆవరణలో మండల ప్రత్యేక కిషన్తోపాటు మండల అధికారులు కలిసి మొక్కను నాటి,నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనమహోత్సవంలో, స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కలను కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, మొక్కలను సంరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మొక్కలు నాటితే సరిపోదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కను పశువులు మేయకుండా మొక్కలకు కంచెలను ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలునాటడం ఒక్కటే పరిష్కారమార్గం అని ప్రస్తుతం మనం నాటిన మొక్కలే వృక్షాలై మన భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును అందిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో కనీసం రెండు మూడు మొక్కలు నాటి, కాపాడేందుకు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పారిశుద్ధ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు మురికి కాలువలు శుభ్రం చేయించి దోమలు వృద్ది చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓలక్ష్మీకాంతరెడ్డి, ఎమ్మార్వో దశరథ్, పాఠశాలప్రధానోపాధ్యారలు కమల, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నాగిరెడ్డి, ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు, దితరులు పాల్గొన్నారు.