ఆపరేషన్ ముస్కాన్-9 వివరములు వెల్లడించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్ 

నవతెలంగాణ -కంటేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ – 9 కార్యక్రమం తేది 01-07-2023 నుండి తేది: 31-07-2023 వరకు కొనసాగిందని నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్. గురువారం తెలియజేశారు.ఈ ఆపరేషన్ ముస్కాన్ ముఖ్య ఉద్దేశ్యం 18 సం॥లలోపు తప్పిపోయిన / వదిలివేయబడిన / కార్మికులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి, వారితో పనిచేయిం చిని యాజమానిపై కేసు నమోదు చేయడం కాని లేదా వారి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించ డం కాని, తల్లి దండ్రులు లేని వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటి (సి.డబ్ల్యూ.సి) వారికి అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ 9 లో నిజామాబాద్ కమీషనరేటు పరిధిలో గల నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 50 మంది పిల్లలను పట్టుకోవడం జరిగిందని వివరించారు. ఇందులో నిజామాబాద్ డివిజన్ నందు ఒకటవ పోలీస్ స్టేషన్ యందు ఒకరిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసామన్నారు. మిగితా పిల్లల్ని వారి వారి తల్లి తండ్రులకు అప్పజెప్పడం జరిగిందని తెలియజేశారు. అలాగే తప్పిపోయిన పిల్లల వివరాలను దర్శన్ యాప్ లో నమోదు చేసి వారి అడ్రస్ లను గుర్తించడానికి ప్రయత్నించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ లో పట్టుకున్న పిల్లల వివరాలు ఈ  విధంగా ఉన్నాయని తెలిపారు. సబ్ డివిజన్ వారిగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య నిజామాబాద్ 19, ఆర్మూర్ 14, బోధన్ 17 మొత్తం 50 మంది బాలలను గుర్తించినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఖ్య ఈ విధంగా ఉందన్నారు.నిజామాబాద్ 19,ఆర్మూర్ 14, బోధన్=17, మొత్తం=50 అని తెలిపారు. కావున ప్రజలు తప్పిపోయిన, పనిచేయుచున్న, వదిలివేయబడిన బాలబాలికల సమాచారం తెలిసినట్లయితే సంబంధిత ఫోన్ నెంబర్లకు సమాచారం అందించగలరు అని తెలిపారు.  ఇక ముందు కూడా ఇలాంటి వారి సమాచారం డయల్ 100, సెల్ నెంబర్ 87126-59777, ఫోన్ చేసి సమాచారం అందించగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
Spread the love