చైర్మన్ గా శ్రీనివాస్ పటేల్ బాధ్యతలు స్వీకరణ
నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం పిఎసిఎస్ పాలకవర్గాల కాల పరిమితి ముగియడంతో వాటిని రద్దు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. మళ్లీ రద్దయిన పిఎసిఎస్ పాలకవర్గాల కొనసాగింపు పై ఉత్తర్వులు జారీ కావడంతో మద్నూర్ పిఎసిఎస్ చైర్మన్గా శ్రీనివాస్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ పటేల్ కు పిఎసిఎస్ సెక్రటరీ గంగాధర్, పిఎసిఎస్ సిబ్బంది కలిసి శాలువతో ఘనంగా సత్కరిస్తూ బాధ్యతల ఉత్తర్వుల కాపీని అందజేశారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పటేల్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి, సంబంధిత శాఖ మంత్రి కి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
పీఏసీఎఎస్ పాలకవర్గం బాధ్యతల కొనసాగింపుకు ఉత్తర్వులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



