దేశానికి ఆదర్శంగా ద.మ.రైల్వే జీఎమ్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే దేశానికి ఆదర్శంగా ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తూ, ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నదని జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. మంగళవారం నాడిక్కడి రైల్‌ నిలయంలో 77వ స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరిం చుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. జోన్‌ పరిధిలో భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కోవిడ్‌ తర్వాత దక్షిణ మధ్య రైల్వే సాధించిన విజయాలను వివరించారు.

Spread the love