Tuesday, June 23, 2026
E-PAPER
Homeఖమ్మంవిత్తన మేళా కు విశేష స్పందన

విత్తన మేళా కు విశేష స్పందన

- Advertisement -

– రైతులకు నాణ్యమైన విత్తనాలు,నానో ఎరువులపై అవగాహన
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని అశ్వారావుపేట, నారాయణపురం రైతు వేదికల్లో మంగళవారం నిర్వహించిన విత్తన మేళాకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. మండల పరిధిలోని రైతులు అధిక సంఖ్యలో హాజరై వివిధ పంటల విత్తనాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన పొందారు.

మేళాలో వరి సన్నరకాల విత్తనాలు, అపరాల విత్తనాలు, కూరగాయల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. అలాగే పంటల దిగుబడులను పెంచేందుకు ఉపయోగపడే నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరించారు. నానో ఎరువుల వినియోగం వల్ల ఎరువుల వినియోగ పరిమాణం తగ్గడంతో పాటు పంటల పెరుగుదల మెరుగుపడి సాగు వ్యయాలు తగ్గుతాయని తెలిపారు.

విత్తనాల ఎంపిక, విత్తే సమయం, ఎరువుల నిర్వహణ, పంట సంరక్షణ వంటి అంశాలపై రైతులు అధికారులను ప్రశ్నించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేసి ఉత్పాదకతను పెంచడమే విత్తన మేళా ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు విత్తన మేళా నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలని కోరారు.

కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి పి. శ్రీనివాసరావు, ఏఈఓలు సతీష్, రవీంద్ర, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, ప్యాక్స్ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, తుమ్మ రాంబాబు, స్థానిక విత్తన డీలర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -