సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం..

Palabhishekam for CM Revanth Reddy's film..నవతెలంగాణ – నవీపేట్
రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కావడంతో మండలంలోని బినోల గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీతో పాటు సన్న రకంధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివిటి మహేందర్, విజయ్, గంగాధర్, పోశెట్టి, కైసరోద్దీన్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love