పాలకుర్తి టూరిజం హౌటల్‌ విశాలంగా ఉండాలి

మంత్రి ఎర్రబెల్లికి నిర్మాణ ప్లాన్‌ చూపెట్టిన టూరిజం అధికారులు
టూరిజం అధికారుల సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పాలకుర్తిలో రూ.25 కోట్లతో నిర్మించనున్న టూరిజం హౌటల్‌ విశాలంగా ఉండాలని సంబంధిత అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. నిర్మాణ పనులపై సోమవారం హైదరాబాద్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ మాట్లాడుతూ… పాలకుర్తిలో టూరిజం హౌటల్‌ను విశాలంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ హౌటల్‌ నిర్మాణం అయితే, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పాలకుర్తికి వచ్చే టూరిస్టులు, భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు పాలకుర్తిలో బస చేయడానికి వీలు కలుగుతుందని మంత్రి చెప్పారు. పాలకుర్తి ప్రాంత అభివద్ధికి టూరిజం హౌటల్‌ ఎంతగానో ఉపయోగ పడుతుందని, ఈ హౌటల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం, కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి మరోసారి కతజ్ఞతలు తెలిపారు.

Spread the love