తహశీల్దార్ వద్దకు చేరిన స్థలం పంచాయితీ…

ఆర్ఐ కేటాయించినా ఆటంక పరుస్తున్న ఆక్రమణ దారులు…

నవతెలంగాణ – అశ్వారావుపేట: పంచాయితి కార్యాలయం భవన నిర్మాణానికి అవసరం అయిన స్థలం రెవిన్యూ అధికారులు కేటాయించినా ఆక్రమణ దారులు ఆటంక పరచడం తో భవన నిర్మాణం నిలిచిపోయింది. 2022 – 2023 ఆర్ధిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ నిధులతో మండలంలోని మద్దికొండ, అశ్వారావుపేట, కన్నాయిగూడెం, పాతల్లి గూడెం, నారంవారిగూడెం కాలనీ, రామన్నగూడెం, నారాయణపురం, వినాయకపురం, మల్లాయిగూడెం, తిరుమలకుంటలో 10 పంచాయితీలకు కార్యాలయ భవనాలను మంజూరు చేసారు. ఈ ఒక్కో భవనానికి రూ.20 లక్షలు అంచనా వ్యయంతో పంచాయితీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పనులు చేపట్టారు. వీటిలో తిరుమలకుంట పంచాయితీ భవనం తప్ప మిగతా 9 భవనాలు దాదాపుగా పూర్తి కావచ్చింది.
తిరుమలకుంటలో తహశీల్దార్ ఆదేశాలు మేరకు ఆర్.ఐ పద్మావతి 250 గజాలు స్థలం కేటాయించారు. కానీ ఈ స్థలం ఆక్రమణ దారులు మాత్రం ఆ స్థలంలో పంచాయితీ భవనం నిర్మిస్తే ఊరుకునేది లేదని పట్టుబడుతున్నారు. ఇదే విషయాన్ని గురువారం పీఆర్ డీ ఈ రామం తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ దృష్టికి తెచ్చారు.ఇదే విషయం తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ ఆర్ ఐ పద్మావతి ని పిలిచి వివరణ కోరారు. హద్దులు తో సహా స్థలం అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ విషయం పై సర్పంచ్ సున్నం సరస్వతి ని వివరణ కోరగా ఆమె భర్త సమాధానం ఇచ్చాడు. ముగ్గురు పేద కుటుంబాల స్వాదీనం ఆ స్థలం ఉన్నదని, ఈ  స్థలం తప్ప మాకు వేరే గత్యంతరం లేదని నాటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేస్తే మరో స్థలం చూడాలని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సిఫార్స్ చేసారని తెలిపారు.

Spread the love