నవతెలంగాణ-ఆదిభట్ల
ఆదిభట్ల మున్సిపాలిటీలోని ఎంపీపటేల్‌గూడలోని హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పార్క్‌లు పెంటకుప్పలుగా మారాయి. ఒకప్పుడు పచ్చగా కళకళాడే పార్కులు అధి కారుల నిర్లక్ష్యంతో అధ్వా నంగా ఉన్నాయి. నిరుప యోగంగా ఉండటంతో పాములు, తేళ్లు చేరుతు న్నాయి.ఆ ప్రాంతానికి వెళ్లా లంటేనే పిల్లలు ఆడుకు నేందుకు భయ పడు తున్నారు. ప్రజలు కూడా కాసేపు ఊరటడ పొందేం దుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబం ధిత అధికారులు స్పందించి, పార్కును ఎప్పటికప్పుడూ పరిశుభ్రం చేసి, పచ్చదనం తోపాటు, ఆహ్లాదకరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరు తున్నారు. లేకపోతే పెంట కుప్పలాగా పేరుకుపోయే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు.
ఆదిభట్ల మున్సిపాలిటీ ఎంపీ పటేల్‌గూడలోని బీరప్పగుడి సమీపంలో పేరుకు పోయిన చెత్త, తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేయాలి. చెత్తపేరుకు పోవడంతో దుర్వాసన వెదజల్లు తోందని ప్రజలు ఆందోళన చెందు తున్నారు. వాహనదారుల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. అభివృద్ధే ధ్యేయం అని చెప్పే అధి కారులు సమస్యలు పరిష్కరించడంలో విఫలమవు తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి, చెత్తపేరుకు పోకుండా ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.