నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నవతెలంగాణ -హైదరాబాద్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం CM చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు.

Spread the love