మండల కేంద్రంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండుగ..

నవతెలంగాణ – రెంజల్ 

మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా పెద్దమ్మతల్లి ఆలయం వరకు వచ్చి పెద్దమ్మతల్లికి నైవేద్యాలు సమర్పించారు. తమ గ్రామాన్ని చల్లగా చూడాలని వర్షాలు కురుస్తూ పాడి పంటలతో గ్రామం లో ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా చూడాలని వారు కోరుకున్నారు.
Spread the love