
జార్ఖండ్ రాష్ట్రంలో మాదిరిగా మలిదశ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన సౌకర్యం కల్పించాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షులు అజ్మీర సురేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాలులో మలిదశ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురేష్ హాజరై మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలని అన్నారు. బలిదశ ఉద్యమకారుల సంఘం సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ఆదివారం 27 వ తేది న తలపెట్టిన ధర్నా కు ఉద్యమకారులు భారీగా తరలి రావాలని అన్నారు. 2001 నుండి టిఆర్ఎస్ పార్టీ లో ఉంటూ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేశామని, ఈ పోరాటంలో ఎన్నో కష్ట నష్టాల కోర్చి రెండు సార్లు ప్రభుత్వ ఏర్పాటు లో కీలకంగా వ్యవరించామని, అయినా తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. అందుకే అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు, ప్రభుత్వం స్పందించి ఉద్యమకారుల కోసం సంక్షేమ కార్యక్రమాలు వెంటనే చేపట్టి జార్ఖండ్ రాష్ట్ర తరహా లో పింఛన్ సౌకర్యం, సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లోఉట్ల మోహన్,నిమ్మగడ్డ నరేందర్,అకినేపల్లి రమేష్, మెడిదుల వెంకన్న,దర్శనాల సంజీవ, బత్తుల రాణి, నామాల మురళి,జన్ను రాంబాబు గట్టయ్య,రేండ్ల శ్రీనివాస్,పెండెం హేమాద్రి, సారయ్య,సుధాకర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.