కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి: హరీష్ రావు

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హారీష్ రావు మరోసారి విరుచుకుపడ్డాడు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి తాము రైతు దీక్షలు చేస్తున్నామని అన్నారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో అయన పాల్గొన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఎండిన పంటపొలాలను కనీసం చూడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. ఆఖరికి రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు.  పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం చెల్లించాలి. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మానాలని అన్నారు. మామీద విమర్శలు చేయండి,  తిట్టండి. కానీ రైతుల గురించి ఆలోచించండి, వాళ్ళను ఆదుకోండి. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండని సూచించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, వడ్లకు, మక్కలకు రూ.500 బోనస్, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతుల రూ.15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని ఆయన విమర్శించారు.

Spread the love