వాతావరణ కేంద్రం సూచనల మేరకు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఒక ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు పలు రకాల సూచనలు ఇచ్చారు భారీ వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలని గత రెండు,మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని,మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకువర్షాల వల్ల తడిసిన కరెంటు స్తంభాలు,విద్యుత్ తీగలు,ఇనుప స్తంభాలు తాకకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.ముఖ్యంగా పిల్లలు,వృద్దులు బయటకు రాకుండా చూసుకోవాలి.రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండండి. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల వద్దకు వెళ్లకండి.శిథిలావస్థలో ఉన్న ఇళ్ళలో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.డ్రైనేజీ కాలువలు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్ళకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి కోరారు.