కళ్ళ కలక వ్యాధిపట్ల ప్రజలు ఆందోళన చెందవద్దు

నవతెలంగాణ- కంటేశ్వర్
కళ్ళ కళక వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కళ్ళ కలక నివారణకు మందులను ప్రభుత్వాసుపత్రితో పాటు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ మాట్లాడారు. వివరాల్లోకి వెళితే రాష్ట్రవ్యాప్తంగా కళ్ళ కలక వ్యాధి ప్రభలుతున్నదని దీనిపై ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కళ్ల కలక నివారణ మందులు జిజిహెచ్ తో పాటు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని ప్రజలు గుర్తించాలని తెలియజేశారు.సాయిబాబా, శంకర్హొ శోభ దాదాపు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల వివిధ జిల్లాలకుచెందిన వ్యక్తులు వేరు వేరు కారణాల వల్ల, గతంలో జరిగిన శస్త్ర చికిత్సల వల్ల కాలి ఎముకకు సంబంధించిన రుగ్మతతో బాధపడుతూ, గతంలో ప్రైవేటుహొ ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో చూపించుకున్నా కూడా నయం కాలేదని , మంచానికే పరిమితమైన రోగులు నడువగలుగుతున్న వారిని జిజిహెచ్ ఆసుపత్రిలో ఎముకల విభాగాధిపతి డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ పి ఎల్ శ్రీనివాస్ మరియు వారి బృందం కలిసి శస్త్ర చికిత్సను నిర్వహించి వారికి చికిత్స అందించడం జరిగిందని , దాదాపు ఇది 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఇక్కడ ఉచితంగా నిర్వహించామని తెలియజేశారు.హొలబ్ధిదారులు తమకు జరిగిన శస్త్ర చికిత్సలకు కృతజ్ఞతతో సూపరింటెండెంట్ కి ఎముకల విభాగానికి సంబంధించిన వైద్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తాము ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నామని సంతోషం వ్యక్తం చేశారు.హొఇటీవల ఆసుపత్రిలో ప్రసూతి గదిలో పేషంట్ బంధువులు మహిళ వైద్యురాలిపై దాడి చేశారని దీనిపై పోలీస్ కేసు పెట్టామని తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులపై మరియు ఆసుపత్రి సిబ్బంది సెక్యూరిటీ పై ప్రజలు విచక్షణ రహితంగా దాడులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హొప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని సేవ చేసే వైద్యులపై ఆసుపత్రి సిబ్బందిపై ఇలా దాడులు చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ప్రజలు ఇలా ప్రవర్తించకుండా సామరస్యంతో మానవతా దృక్పథంతో నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలరాజ్ , డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ పి ఎల్ శ్రీనివాస్ , డాక్టర్ కిరణ్ , జూడో సంగం ప్రతినిధులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కింద సీఎంఈ(జశీఅ్‌ఱఅబఱఅస్త్ర వీవసఱషaశ్రీ జుసబషa్‌ఱశీఅ) గురించి చెప్పడం జరిగింది.హొహొపెల్వి ఎస్టాబ్లర్ సీఎంఇ – ఆగష్టు 5 న, కాడావెరిక్ (శవం) సీఎంఇ – ఆగష్టు 6 న , ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహింపబడుతోంది.ఇధి మొదటిసారి తెలంగాణలో చేయటం జరుగుతుంది. అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నాగేశ్వరరావు బాలరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love