– సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
– జగిత్యాలలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ- జగిత్యాలటౌన్
ప్రజలకు ఆరోగ్యపరంగా మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.16 కోట్లతో క్రిటికల్ కేర్ హాస్పిటల్ భవన నిర్మాణం, మరో రూ.3.60 కోట్లతో కేంద్ర ఔషధ గిడ్డంగి భవన నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రుల నిర్మాణం చేపడుతోందని చెప్పారు. వాటిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, కలెక్టర్ యాస్మీన్ భాషా, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద్, మున్సిపల్ చైర్మెన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.