ఆలయాలపై హైకోర్టులో పిటిషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న ఆలయాలను దేవాదాయ,ధర్మాదాయ శాఖ చట్ట పరిధి నుంచి తొలగించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిని విచారించిన జస్టిస్‌ సుమలత దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేశారు. అఖిల భారత హిందూ మహా సభ అధ్యక్షులు నాగిళ్ల శ్రీనివాస్‌, గుంటి రాఘునాథస్వామి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు గురిగంట్ల రంగయ్య, ధర్మశాల వ్యవస్థాపక కుటుంబ సభ్యులు మటికె గౌరీ శంకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న ఆలయాల నుంచి ప్రభుత్వం వివిధ రూపాల్లో వసూళ్లు చేస్తోందనీ, వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాను చట్ట పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

Spread the love