ఓల్డ్ విద్యాశాఖ స్థలం కోసం శాసనసభ్యునికి వినతి

Petition to legislator for Old Education Department siteనవతెలంగాణ – కంఠేశ్వర్ 

జిల్లా న్యాయవ్యవస్థ కార్యాలయాల అవసరాలరీత్య ఓల్డ్ విద్యాశాఖ ఖాళీ స్థలాన్ని కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి,చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్,బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, సీనియర్ న్యాయవాదులు ఎమ్. సుదర్శన్ రెడ్డి, ఆశా నారాయణ, జి. పి.ఎస్ ప్రభాకర్ రెడ్డి,శ్యామ్ బాబు లతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.జిల్లాకోర్టు ప్రాంగణంలో కోర్టుల సంఖ్య పెరిగిందని దానికి అనుగుణంగా కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిందని జగన్ వివరించారు. మోటారు వాహనాల పార్కింగ్ కు ప్రస్తుత జిల్లాకోర్టు ఆవరణ సరిపోక కోర్టు బయట మోటారు వాహనాలను నిలపడం మూలంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నదని తెలిపారు. జిల్లాకోర్టుకు అవరణకు ఆనుకుని ఉన్న ఓల్డ్ ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ ఖాళీ స్థలం జిల్లా న్యాయవ్యవస్థ అవసరాలకు అనువుగా ఉంటుందని ఆయన అన్నారు. సదరు రెండు ఎకరాల స్థలాన్ని న్యాయవ్యవస్థ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా సహకరించాలని జగన్ విన్నవించారు. వినతిపత్రాన్ని చదివిన శాసనసభ్యులు భూపతి రెడ్డి న్యాయార్థులు,న్యాయవాదులు,న్యాయమూర్తులు,న్యాయశాఖ సిబ్బంది విశాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నందున తాను సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు.
Spread the love