దేశ వ్యాప్తంగా12 కోట్ల గృహాలకు పైప్‌ గ్యాస్‌

Piped gas to 12 crore households across the country– పీిఎన్‌జీఆర్‌బీ సభ్యుడు అంజనీ కుమార్‌
హైదరాబాద్‌ : మహాబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని సౌత్‌ ఆసియన్‌ సిరామిక్‌ టైల్స్‌ కంపెనీకి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పిఎన్‌జి కనెక్షన్‌ను పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డ మెంటర్‌ అంజనీకుమార్‌ తివారి గురువారం ప్రారంభించారు. వీటితో పాటు ఈ ప్రాంతంలో నేచురల్‌ గ్యాస్‌ సరఫరా చేయడానికి వీలుగా పోలేపల్లి పారిశ్రామిక ప్రాంతంలో మధర్‌ సిఎన్‌జి స్టేషన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలతో పాటు, వాహానాలకు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ను మెఘా గ్యాస్‌ సరఫరా చేయనున్నట్లు మెఘా గ్యాస్‌ తెలిపింది. ఈ సందర్భంగా అంజనీకుమార్‌ తివారి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా.. కీలకమైన పది రాష్ట్రాల్లోని 22 జియోగ్రాఫికల్‌ ఏరియాల్లో నేచురల్‌ గ్యాస్‌ సరఫరా చేస్తూ మేఘా గ్యాస్‌ అగ్రగామిగా ఉందన్నారు. పిఎన్జిఆర్బి దేశ వ్యాప్తంగా 12కోట్ల మందికి పిఎన్జి కనెక్షన్లు అందించాలని లక్ష్యం పెట్టుకోగా, ఇందులో మేఘా గ్యాస్‌ 1.3కోట్ల కనెక్షన్లు అందించనుందన్నారు. 17000కు పైగా సిఎన్‌జి స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా వీటిలో 2200కు పైగా స్టేషన్లను మెఘా అందుబాటులోకి తీసుకురానుందన్నారు. ఈ కార్యక్రమంలో మేఘా గ్యాస్‌ డైరెక్టర్‌, సిఇఒ పలింపాటి వెంకటేష్‌, ఛీప్‌ జనరల్‌ మేనేజర్‌ తిమ్మారెడ్డి, ఇతర సిబ్బండి పాల్గొన్నారు.

 

Spread the love