హోలీ పాటతో దూసుకెళ్తున్న ‘ప్లానెట్ రెడ్ మ్యూజిక్’ టీమ్

నవతెలంగాణ-హైదరాబాద్ : ‘మాయ చేశావే’, ‘హర హర మహదేవా’, ‘ఈ నైటే’, ‘ప్రశ్న’ వంటి పాటలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన ప్లానెట్ రెడ్ మ్యూజిక్ టీమ్ ఈసారి హోలీ పాటతో దుమ్ము దులిపేసింది. వెంకటేశ్ వుప్పల,అనంత్ ఆశ్రిత్,తిరునగరి శరత్ చంద్ర.. ‘లైఫంతా హోలీ’ అనే పాటతో ఒక ఊపు ఊపేసారు..
వెంకటేష్ వుప్పల సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి అందరినుంచి మంచి స్పందనను అందుకుంది. హోలీ పండుగను ఒక పార్టీ సాంగ్ లాగా చేశారు వెంకటేష్ వుప్పల. ర్యాప్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఇది వరకు వచ్చిన హోలీ పాటలన్నీ ఒక ఎత్తు. ఈ హోలీ పాట ఒక ఎత్తు అనే ప్రశంసలు కూడా రావడం విశేషం. హోలీ సంబరాల్లో చిన్నా పెద్దా అందరూ ఈ పాటతోనే డ్యాన్సులు కూడా వేశారు. అందరినోటా ఇదే పాట. అనంత ఆశ్రిత్ ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు.ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా అశ్రిత్ ఈ పాటను పాడడం విశేషం. తిరునగరి శరత్ చంద్ర సరికొత్త శైలిలో ఈ పాటను రాశారు. హోలీని ఎంజాయ్ చేయాలి అంటూనే హోలీ పండుగలో పూసుకునే రంగుల్లో ఒక్కో రంగు ఏం సందేశం ఇస్తుందో కూడా ఆయన ర్యాప్ లో చెప్పారు. ఒక్కో రంగు పూసి ఒక్కో స్టైల్ లో ఎంజాయ్ చేయాలంటూ కొత్తగా రాశారు తిరునగరి శరత్ చంద్ర. ఈ పాటకు మ్యూజిక్, మిక్స్,మాస్టరింగ్, ర్యాప్ సింగింగ్, లిరికల్ వీడియో, మార్కెటింగ్, పోస్టర్ డిజైనింగ్ వెంకటేష్ వుప్పల అందించగా, అనంత ఆశ్రిత్ గానం, తిరునగరి శరత్ చంద్ర సాహిత్యం అందించారు.

Spread the love