విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైల‌ర్..


నవతెలంగాణ-హైదరాబాద్ : గీతా గోవిందం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏప్రిల్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. తాజాగా ఫ్యామిలీ స్టార్ ట్రైల‌ర్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్, కామెడీ అంశాల‌తో ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. స్వామి…కొత్త‌గా నాకు లైఫ్‌లో బ్రేక్‌లు ఇవ్వాల్సిన ప‌నిలేదు. ఉన్న‌దానిని మాత్రం చెడ‌గొట్ట‌కు అనే విజ‌య్ దేవ‌ర‌కొండ డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ట్రైల‌ర్‌లో ట్రెండీ లుక్‌లో మృణాల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు నుంచి ఫ్రెండ్‌షిప్‌లు, తిర‌గ‌డాలు బంద్‌. ఆ పిల్ల ఇంటికి రావ‌డానికి వీలులేదు. మీరు పైకి వెళ్ల‌డానికి వీలు లేదు అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఒట్టు వేయించుకోవ‌డం న‌వ్విస్తోంది. మొత్తంగా ఈ చిత్రం ప్యామిలీ, లవ్, యాక్షన్ డ్రామాగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించారు. దిల్ రాజు నిర్మాత.

Spread the love