ప్లాస్టిక్ నివారణ లక్ష్యం

– నిజామాబాద్ ఫారెస్ట్ అధికారులు, సిరివెన్నెల
– స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో
నవతెలంగాణ కంటేశ్వర్
ప్లాస్టిక్ నివారణ లక్ష్యం అని నిజామాబాద్ ఎఫ్డిఓ రామ్ కిషన్  అన్నారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ ఫారెస్ట్ అధికారి వికాస్ మీనా ఆదేశాల మేరకు నిజామాబాద్ ఫారెస్ట్ ఎఫ్డిఓ, ఎఫ్ ఆర్ ఓ లు పద్మారావు, ఫారెస్ట్ అధికారులు సిబ్బంది తోపాటు సిరివెన్నెల గ్రీన్ సొసైటీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సారంగాపూర్ లో గల అర్బన్ పార్క్ నందు ప్లాస్టిక్ తొలగించాలని ఉద్దేశంతో ప్లాస్టిక్ తో పాటు అర్బన్ పార్క్ లో ఉన్నటువంటి చెత్తను కూడా తొలగించారు. ఈ సందర్భంగా ఎఫ్డిఓ రామ్ కిషన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ ప్రజలు కూడా ప్లాస్టిక్ను నివారించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అందులో భాగంగానే తమ వంతుగా తమ పరిధిలో ఉన్నటువంటి పార్కులను కూడా ప్లాస్టిక్ లేకుండా శుభ్రం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల గ్రీన్ సొసైటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు జనార్ధన్ ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు ప్రతాప్ జహూర్ భాస్కర్ ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love